Saturday, December 21, 2024

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు అధికారిక టైర్‌ భాగస్వామిగా బీకెటీ..

- Advertisement -
- Advertisement -

భారతీయ బహుళ జాతి కపెనీ, ఆఫ్‌–హైవే టైర్‌ మార్కెట్‌లో అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (బీకెటీ) ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు అధికారిక టైర్‌ భాగస్వామిగా రాబోతున్న టీ20 లీగ్‌ 2023 కోసం వ్యవహరించనుంది. ఈ 16వ ఎడిషన్‌ టీ20 2023 క్రికెట్‌ సీజన్‌ మార్చి 31, 2023నుంచి ప్రారంభంకానుంది.

ఈ భాగస్వామ్యం గురించి బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ పొద్దార్‌ మాట్లాడుతూ ‘‘ఆరెంజ్‌ ఆర్మీగా గుర్తింపు పొందిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు పట్టుదల, అంకితభావం, విజయం సాధించడానికి పడే తపన కారణంగా గుర్తింపు ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యొక్క ‘ఎన్నడూ పట్టువదలవద్దు ’ అనే స్ఫూర్తితో మాకు సంబంధం ఉందని భావిస్తున్నాము. ఆఫ్‌ –హైవే టైర్‌ పరిశ్రమలో నూతన సంస్ధగా పోటీని మేము అర్ధం చేసుకున్నాము. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారితో కలిసి ఈ 16వ ఎడిషన్‌ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.

ఈ భాగస్వామ్యం గురించి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈఓ కె షణ్ముగం మాట్లాడుతూ ‘‘ఓ భారతీయ బహుళ జాతి సంస్ధ బీకెటీ మా అధికారిక టైర్‌ భాగస్వామిగా వరుసగా రెండవ సీజన్‌లో సైతం నిలవడం పట్ల సంతోషంగా ఉన్నాము’’అని అన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News