- Advertisement -
వాషింగ్టన్: కెనడా నుండి అమెరికాకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించి మరణించిన ఇద్దరు చిన్నారులతో సహా ఎనిమిది మంది మృతదేహాలను కెనడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన వారిలో కెనడా నుండి సెయింట్ లారెన్స్ నది మీదుగా పడవలో యుఎస్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న భారత్, రొమేనియాకు చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పెద్దలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూస్తామని అధికారులు వెల్లడించారు.
- Advertisement -