Sunday, January 19, 2025

బీహార్‌లో బిజెపి కొత్త కూటమి!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిహార్‌లో అగ్రకులాలు, మెజార్టీ వెనుకబడిన వర్గాలుతో కలిపి అరుదైన సామాజిక కూటమికి ప్రయత్నిస్తోంది. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బలీయమైన ఆర్‌జెడిజెడి (యు) కూటమిని ఓడించేందుకు కమలంపార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీహార్ అధికార కూటమిలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జెడి బలమైన పార్టీ అయినప్పటికీ సిఎం నితీశ్‌కుమార్ జనతాదళ్ (యు) మద్దతు వర్గాలను తమవైపు తిప్పుకోవడం ద్వారా విజయం సాధించాలని బిజెపి ప్రణాళికలు రచిస్తోంది.

దీనిలో భాగంగా వెనుకబడిన కులాలు, దళిత సంఘాలపై దృష్టి సారించింది. ఈక్రమంలో మౌర్య చక్రవర్తి అశోకుడి జయంతిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నిర్వహించనున్నారు. గత ఏడు నెలల్లో నాలుగోసారి పర్యటిస్తున్న షా సంఖ్యాపరంగా బలమైన కుష్వాహా ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కుష్వాహా వర్గీయులు అశోకుడిని తమ వంశస్థుడిగా విశ్వసిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News