- Advertisement -
ఎర్రుపాలెం: స్థానిక రైల్వే స్టేషన్ వద్ద టికెట్ కొరకు రైల్వే ట్రాక్ దాటేందుకు శనివారం గూడ్స్ రైలు ఆగి ఉండటంతో దాని క్రింద దూరి రావాలని ప్రయత్నించగా మధ్యలోకి రాగానే ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో ఒక్కసారిగా ప్రక్కనున్న వారు పెద్దగా అరవడంతో స్టేషన్ మాస్టర్ వెంటనే రైలును నిలపారు.
ఈ ఘటనలో ఎన్టీఆర్ జిల్లా పరిటాలకు చెందిన రైతు ఆకుల పెద్దబాబు 56 తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించగా ఎడమ చేయికి తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్సకోసం విజయవాడ తరిలించారు.
- Advertisement -