- Advertisement -
హైదరాబాద్: తిరుమలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు. శ్రీవారి దర్శనానికి వెల్లే భక్తులతో పాటు, దర్శనానంతరం ఆలయం వెలుపలికి చేరుకున్న భక్తులు వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు తిరుమలలో గత నాలుగు రోజులుగా వాతావరణం మారిపోయింది. ఓ పక్క ఉదయం భగభగ మండే ఎండలు సాయంత్రానికి హఠాత్తుగా ఉరుములు, మెరుపులో భారీ వర్షం కురుస్తోంది. ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరైన భక్తులు వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో సేద తీరుతున్నారు. మొదటి, రెండో ఘాట్ రోడ్లలో వర్షం కారణంగా అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉడటంతో ద్విచక్ర వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు.
- Advertisement -