- Advertisement -
లిటిల్‌రాక్ ( అమెరికా) : అమెరికా లోని ఆర్కన్సాస్, ఇల్లినాయిస్ ప్రాంతాల్లో శుక్రవారం టోర్నడోల బీభత్సంతో ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆర్కన్సాస్‌లో ఇళ్లు, షాపింగ్‌సెంటర్లు, ధ్వంసం అయ్యాయి. ఇల్లినాయిస్‌లో థియేటర్ కూలిపోయింది. లిటిల్ రాక్ ఏరియాలో ఒకరు మృతి చెందగా, రెండు డజన్ల మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరస్థితి ఆందోళన కరంగా ఉంది.
ఆర్కన్సాస్ ఈశాన్య ప్రాంతంలో విన్నే పట్టణం ధ్వంసమైంది. అక్కడ ఇద్దరు చనిపోయారు. కూలిన ఇళ్ల శిధిలాల్లో అనేక మంది ఇరుక్కున్నారు. బెల్విడెర్, ఇల్లినాయిస్‌లో శుక్రవారం రాత్రి థియేటర్ పై కప్పు కూలడంతో 28 మంది గాయపడ్డారు. భారీతుపాను గాలులకు కొన్ని చోట్ల గడ్డివాములకు మంటలు అంటుకున్నాయి. ఒక్లహోమాలో బీభత్సంతో ప్రజలు నిర్వాసితులయ్యారు. మొత్తం 85 మిలియన్ మంది బాధితులయ్యారు.
- Advertisement -