Sunday, November 24, 2024

కార్గో విమానాన్ని ఢీకొట్టిన పక్షి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దుబాయ్‌కి వెళుతున్న అమెరికాకు చెందిన ఫెడ్‌ఎక్స్ (ఎఫ్‌ఎక్స్) విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన వెంటనే పక్షి ఢీకొట్టింది. దీంతో తిరిగి ఎయిర్‌పోర్టులో కార్గో విమానం ఎఫ్‌ఎక్స్ 5279 ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. విమానం ల్యాండింగ్ కోసం అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. పక్షి ఢీకొట్టడంతో విమానం విండ్‌షీల్డ్ పగుళ్లు ఏర్పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫెడ్‌ఎక్స్ ఆపరేట్ చేసే విమానం 10.46కు టేకాఫ్ అయినతరువాత పక్షి ఢీకొట్టడంతో 10.50సమయానికి విమానాశ్రయానికి తిరిగి వచ్చిందన్నారు. భద్రతా తనిఖీల అనంతరం మధ్యాహ్నం విమానం బయలుదేరి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుందని ఫెడ్‌ఎక్స్ ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News