- Advertisement -
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మిజోరం కేడర్ ఐఎఎస్ అధికారికి సిబిఐ కోర్టు మూడే ళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విదించింది. మాజీ ఐఎఎస్ అధికారి కవాడి నరసింహ 1991 మిజోరాం క్యాడర్ ఐఎఎస్ అధికారి. నరసింహ మిజోరాం ప్రభుత్వ సెక్రటరీగా పనిచేస్తున్న సమయంలోనే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి.
దీనిపై విచారణ చేసిన సిబిఐ దర్యాప్తు చేసి హైదరాబాద్ సిబిఐ కోర్టులో కేసు దాఖలు చేసింది. 1991 నుంచి 2006 వరకు పనిచేసిన సమయంలో రూ.32,31,000 అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. కోర్టులో సాక్షాలు ప్రవేశపెట్టగా వాటిని పరిశీలించిన కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
- Advertisement -