Monday, December 23, 2024

కారులో ఉంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని తగలబెట్టారు?

- Advertisement -
- Advertisement -

అమరావతి: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కారులో ఉంచి తగలబెట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గంగుడుపల్లె శివారులో కారు దగ్ధం కావడంతో స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా బ్రహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజుదిగా గుర్తించారు. నాగరాజు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజు బెంగళూరు నుంచి తన సొంతూరుకు వస్తుండగా మార్గం మధ్యలో కారును ఆపి దుండగులు తగలబెట్టినట్టు సమాచారం. పోలీసులు కేసున నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారులో బెంగళూరు నుంచి ఒక్కడే వచ్చాడా? లేక కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజు కుటుంబానికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సిఐ ఓబులేసు తెలిపాడు. ప్రమాదవశాత్తు కారు తగలబడిందా? ఆత్మహత్యా చేసుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. అతి త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. స్థానిక సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. కారులో గోల్డ్ చైన్ లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News