ముంబయి: వివిధ పథకాలకు సంబంధించిన నిధులు విడదల చేయాలంటే లంచం ఇవ్వాలని అధికారులు వేధిస్తుండడంతో ఓ గ్రామ సర్పంచ్ కరెన్సీ నోట్లు గాల్లోకి విసురుతూ నిరసన వ్యక్తం చేసిన సంఘటన మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైతులకు బావులు, ఇతర పథకాల మంజూరుకు అధికారులు లంచం అడుగుతున్నారని రెండు లక్షల రూపాయలు పంచాయతీ సమితి ముందు చల్లుతూ ఓ సర్పంచ్ నిరసన వ్యక్తం చేశాడు. ఈ డబ్బులు చాలకపోతే బిక్షం అడిగి ఇస్తానంటూ డబ్బులు విసిరేయడంతో అక్కడ ఉన్న అధికారులు అవాక్కయ్యారు.
ఇది రైతులు కష్టార్జితమని, అధికారులు చేయాల్సిన పనులకు కూడా లంచం ఇవ్వాల్సి వస్తే ఏం చేయాలని అడిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. రోజు రోజుకు ప్రభుత్వాఫీసుల్లో లంచగొండితనం పెరుగుతోందని మండిపడ్డారు. లంచాలు లేకుండా ఏ చిన్న పని కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో జరగడం లేదని వాపోయారు. ప్రజలకు, ప్రభుత్వాధికారులకు మధ్య ఆన్‌లైన్ సిస్టమ్ పెట్టడంతో పాటు అప్లై చేసుకున్న కొన్ని రోజులలో పనులు జరిగేటట్లు జీవోలు తీసుకొస్తే బాగుంటుందని నెటిజన్లు సలహా ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా మండల పాలన అధికారుల ఆఫీసుల్లో అవినీతి ఎక్కువగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ, పోలీస్ శాఖలో లంచగొండులు ఎక్కువగా తయారయ్యారని నెటిజన్లు వాపోతున్నారు.
पंचायत समितीपुढेच सरपंचाने उधळले लाखो रुपये; काय आहे नेमकं प्रकरण?#Sarpanch #Agitation #Sarkarnama #MaheshSabale pic.twitter.com/LiTvRZtVB8
— Sunil Balasaheb Dhumal (@sunildhml) March 31, 2023