Wednesday, November 27, 2024

ఆర్‌ఎల్‌వి ప్రయోగం ఇస్రో విజయవంతం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. పునర్వినియోగ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వి )ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటక చిత్రదుర్గ లోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజి (ఏటీఆర్‌౦ లో ఆదివారం పునర్వినియోగ లాంచ్ వెహికిల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ చేపట్టింది. డీఆర్‌డీవొ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని పరీక్షించినట్టు ఇస్రో తెలిపింది. ప్రపంచం లోనే తొలిసారి రెక్కలున్న లాంచ్ వెహికిల్‌ను హెలికాప్టర్ ద్వారా 4.5 కిమీ ఎత్తుకు తీసుకెళ్లినట్టు పేర్కొంది.

అనంతరం ఆకాశం నుంచి సురక్షితంగా రన్‌వే పై ల్యాండింగ్ చేసినట్టు వెల్లడించింది. ఆదివారం ఉదయం 7.10 గంటలకు భారత వైమానికి దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా తిరిగి వినియోగించే లాంచ్ వెహికిల్ 4.5 కిమీ ఎత్తుకు ఎగిరినట్టు ఇస్రో తెలియజేసింది. అనంతరం ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగించి దానికదే రన్‌వే పై ల్యాండ్ అయినట్టు తెలిపింది. ఆదివారం ఉదయం 7.40కు ఆటోమేటిక్ ల్యాండింగ్‌ను పూర్తి చేసిందని చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News