Saturday, December 21, 2024

ఉద్యోగులకు స్నాక్స్, ప్రోత్సాహకాలు బంద్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దిగ్గజ ఐటి సంస్థ గూగుల్ లో ఇకపై స్నాక్స్, ప్రోత్సాహకాలు, మధ్యాహ్న భోజనాల వంటి వాటిని నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించింది. గూగుల్ కంపెనీ ప్రధాన ఆర్ధిక అధికారి రుత్ పోరట్ ఉద్యోగులకు లేఖ రాశారు. కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం నిలిపివేస్తున్నట్లు పోరట్ తెలిపారు. అవసరానికి అనుగుణంగా ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. అందులో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర విధుల్లోకి మార్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రోత్సాహకాల తగ్గింపు కార్యాలయాలు ఉన్న ప్రాంతాలను బట్టి, అక్కడి వసతులను బట్టి మారుతుందని స్పష్టం చేశారు. గూగుల్‌లో తొలగింపులకు ఆర్థిక అనిశ్చితే కారణమని కంపెనీ తెలిపింది. 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News