Saturday, December 21, 2024

తొర్రూర్ లో మంత్రి ఎర్రబెల్లితో కలిసి బలగం సినిమా యూనిట్ సందడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ తీసిన బలగం సినిమాను మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులోని శ్రీ వేంకటేశ్వర సినిమా టాకీస్ లో ఆదివారం ప్రదర్శించారు. ఈ సినిమాని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొంతమంది అనాధ పిల్లలు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. అనంతరం తొర్రూర్ కు చేరుకున్న బలగం సినిమా రైటర్, డైరెక్టర్ వేణు ఎల్డంది, నటుడు రచ్చ రవి కెమెరామెన్, ఇతర యూనిట్ సభ్యులు వెంకటేశ్వర థియేటర్ కు వచ్చి మంత్రి ఎర్రబెల్లిని అక్కడ ప్రేక్షకుల్ని కలిశారు. కొద్దిసేపు ప్రేక్షకులు అనాథ పిల్లలతో కలిసి సందడి చేశారు.

మా బలగం మీరేనంటూ ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, బలగం సినిమా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించింది అన్నారు. కంచంలో బొక్క సృష్టించిన సమస్యతో మొదలై ప్రపంచంలో ప్రేమానురాగాలు, బంధాలు, అనుబంధాలను అద్భుతంగా చిత్రీకరించిన సినిమాగా బలగం చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి తెలిపారు. ఇంత గొప్ప సినిమా తీసిన సినీ నటులంతా డైరెక్టర్ తో సహా మనవాళ్లు కావడం, మనతోనే ఉండడం మన అదృష్టం అన్నారు. ఇక పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు సినిమా రంగంలో రాణిస్తుండటం మంచి పరిణామం అని మంత్రి అన్నారు. అమ్మపురం నవీన్ కుమార్ గట్టు పాలకుర్తికి చెందిన శశివర్మ సుంకరి ఇంకా అనేకమంది సినిమా రంగంలో సరికొత్త సినిమాలని తీస్తున్నారని రాణిస్తున్నారని మంత్రి అభినందించారు.

సినిమా డైరెక్టర్ వేణు ఎల్దండి మాట్లాడుతూ, సినిమా సక్సెస్ గురించి చెప్పాల్సింది లేదు కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారం ఎన్నటికీ మరువలేనిది అన్నారు. ఆదరించిన ప్రేక్షకులకు సహకరించిన మంత్రికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. సినీ నటుడు రచ్చ రవి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించిన వాళ్లలో సినిమాకు పనిచేసిన వాళ్లలో ఎక్కువమంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారేమన్నారు. అలాగే సిరిసిల్ల నుంచి వచ్చిన ఎల్దండి వేణు అద్భుత ప్రతిభ కనబరిచారని తన జీవితంలో మరిచిపోలేని గొప్ప అనుభూతిని మిగిల్చిన మంచి సినిమాను ఇచ్చారని చెప్పారు. అలాగే మంత్రి దయన్న చూపిన చొరవ ఆదరణని ఎప్పటికీ మరువలేమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News