- Advertisement -
చేగుంట: ప్రమాద వశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… పొలంపల్లి గ్రామానికి కొండి అంజనేయులు (38) తండ్రి దుర్గయ్య 31 తేదీ ఉదయం 7 గంటలకు ఇంటి నుండి వరి పొలానికి మందు పిచ్‌కారి చేయడానికి వెళ్లి పిచ్‌కారి చేసిన తరువాత పొలంపల్లి పెద్ద చెరువు ప్రక్కన ఉన్న బావిలో చేపలు పట్టడానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. బార్య కొండి భవాణి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం తూప్రాన్ ఎరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రకాష్ గౌడ్ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.
- Advertisement -