Monday, January 20, 2025

లారీ-బైక్ ఢీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

కొడంగల్‌ః లారీ-బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి కొడంగల్ మండల పరిధిలోని ప్యాలమద్ది గేటు వద్ద చోటు చేసుకుంది. కొడంగల్ ఎస్‌ఐ రవిగౌడ్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని అంగడి రైచూర్‌కు చెందిన శ్రీనివాస్ (35) అతని స్నేహితుడు చిన్న నర్సింహులు కలిసి కూలి పని కోసం యాలాల మండలం మల్‌రెడ్డిపల్లికి వెళ్ళారు. సాయంత్రం టిఎస్34ఈ4026 నెంబరు గల ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్యాలమద్ది గేటు వద్ద టిఎస్07యూఏ1786 నెంబరు గల లారీ ఢీకొంది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్, నర్సింహులను చికిత్స కోసం కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ పరిస్తితి విషమించడంతో మేరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో చికిత్స పోందుతూ శ్రీనివాస్ శనివారం మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News