Monday, December 23, 2024

చురుకైన కార్యకర్తలతో టీమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ నిర్వహిస్తున్న అత్మీ య సమ్మేళనాల్లో ప్రతి కార్యకర్తను భాగస్వా మ్యం చేసేవిధంగా పక్కా ప్రణాళికతో ముం దుకు పోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయకులకు పిలుపునిచ్చారు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై ఆదివారం కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కెటిఆర్ తెలిపారు. ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపైన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఆధ్వర్యంలో పది మందితో కూడిన కార్యక్రమాల అమలు కమిటీని ఏర్పాటు చేసినట్లు కెటిఆర్ ప్రకటించారు.

కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుందని తెలిపారు. కమిటీకి జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎంఎల్‌ఎలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీ ద్వారానే కెసిఆర్ పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన సమాచారాన్ని, అభిప్రాయాలను తీసుకుంటారని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గుర్తించి ఈ కమిటీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.
చురుకైన కార్యకర్తలతో టీం ఏర్పాటు చేయాలి
ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రతి శాసనసభ్యుడు అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో కలిపి ఒక టీంను ఏర్పాటు చేసుకోవాలని కెటిఆర్ సూచించారు. ఈ టీం ద్వారా అటు పార్టీకి, ప్రజలకు నిరంతరం సమాచారం అందించేందుకు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పారు.
ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేయాలి
పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రతి భారత రాష్ట్ర సమితి కార్యకర్తను భాగస్వామిని చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దిశానిర్ధేశం చేశారు. ప్రతి ఆత్మీయ సమ్మేళనం కచ్చితంగా ముఖ్యమంత్రి, పార్టీ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలని చెప్పారు. ఆత్మీయ సందేశం ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాల లాంటి మెటీర్నియల్స్‌ను సిద్ధం చేసి విస్తృతంగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు మే నెల వరకు కూడా చేసుకోవచ్చని పార్టీ అధ్యక్షులు కెసిఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరింత విస్తృతంగా కూలంకుషంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎంఎల్‌ఎలకు కెటిఆర్ సూచించారు.
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పదవుల్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయ సమ్మేళనాల్లో హాజరయ్యేలా ఎంఎల్‌ఎలు, జిల్లా అధ్యక్షులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కెటిఆర్ చెప్పారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పార్టీగా, ప్రభుత్వంగా ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకుపోయేందుకు అవకాశం లభిస్తుందన్నారు. తెలంగాణ సాధించిన అభివృద్ధిపైన విస్తృతంగా మాట్లాడే ప్రజాప్రతినిధులను, వక్తలను ప్రత్యేకంగా ఇందుకు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అందివచ్చిన సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారు చేసేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు అద్భుతంగా ఉపయోగపడుతాయని కెటిఆర్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News