Friday, December 20, 2024

రామోజీరావు, శైలజా కిరణ్ ను విచారిస్తున్న ఎపి సిఐడి పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమ వ్యవహారాల సంబంధించిన కేసులో ఆ సంస్థ చైర్మన్ చెరుకు చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజను విచారించేందుకు జూబ్లీహిల్స్ కు 200 మంది ఎపి సిఐడి పోలీసులు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య మార్గదర్శి చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఎండి శైలజలను ఎపి సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. మార్గదర్శి కేసులో ఎ1గా రామోజీరావు, ఎ2 గా శైలజ కిరణ్ లు ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని శైలజ కిరణ్ ఇంటికి చెరుకూరి రామోజీరావు చేరుకున్నారు.

చిట్ ఫండ్ చట్టం నిబంధనలు ఉల్లంఘించి మార్గదర్శి నుంచి నిధులు మళ్లించడంపై ఎపి సిఐడి పోలీసులు పలు సెక్షన్లు 420,409, 120 బి, 477 రెడ్ విత్, కేంద్ర చిట్ ఫండ్ చట్టం 1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. చందాదారుల సొమ్మును మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులుగా పెట్టడంతో ఆర్ బిఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సిఐడి అరెస్టు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ లో కొన్ని బ్రాంచ్ లలో బ్యాలెన్స్ షీట్ సమర్పించకపోవడంతో పాటు ఫామ్ 21ని కూడా మర్గదర్శి సమర్పించలేదు. ఏడు మార్గదర్శి బ్రాంచ్ ల్లో తనిఖీలు చేసి వాటిలో అక్రమాలు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News