Sunday, December 22, 2024

సిసోడియా జుడిషియల్ కస్టడీ ఏప్రిల్ 17 వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టు అయిన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని సోమవారం ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 17 వరకు పొడిగించింది. సిసోడియాను ఏప్రిల్ 17న తమ ఎదుట హాజరుపరచాలని సిబిఐ న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ పోలీసులను ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నందున సిసోడియాను తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది.

కాగా..సిసోడియా బెయిల్ దరఖాస్తును సిబిఐ కోర్టు మార్చి 31న కొట్టివేసింది. ప్రాథమిక సాక్ష్యాల ప్రకారం ఈ నేరపూరిత కుట్రలో ప్రధాన సూత్రధారిగా సిసోడియా ఉన్నారని న్యాయమూర్తి తెలిపారు.ఈ కుంభకోణంలో అడ్వాన్సుగా చెల్లించిన రూ. 100 కోట్లు సిసోడియాకు, ఆప్ ప్రభుత్వంలోని ఆయన సహచరులకు ఉద్దేశించినట్లుగా కనపడుతోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News