- Advertisement -
న్యూఢిల్లీ : అత్యవసరంగా వినియోగించే సుమారు 651 మందుల ధరలు సగటున 6.73 శాతం తగ్గినట్టు నేషనల్ ఫార్మాసిటికట్ ప్రైసింగ్ అథారిటీ పేర్కొంది. ఏప్రిల్ నెల నుంచి ఈ తగ్గింపు అమలు లోకి వస్తుందని వెల్లడించింది. మందుల ధరలను నియంత్రించే ఎన్‌పీపీఏ సంస్థ తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలియజేసింది. ఎన్‌ఎల్‌ఈఎం జాబితాలో మొత్తం 870 షెడ్యూల్డ్ మందులు ఉన్నాయని , అయితే ఈ జాబితా లోని 651 మందులకు ప్రభుత్వం సీలింగ్ విధించినట్టు తెలిపింది.
2022 సెప్టెంబర్‌లో ఎన్‌ఎల్‌ఈఎం ఆరోగ్యమంత్రిత్వశాఖ సవరించిన విషయం తెలిసిందే. తాజాగా విధించిన సీలింగ్‌తో ఆ 651 మందుల ధరలు మొత్తంగా 16.62 శాతం తగ్గినట్టు నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైసింగ్ అథారిటీ పేర్కొంది. అయితే ఆ 651 మందులకు ధరలను నిర్ణయించడం వల్ల వాటి ధరలు 12.12 శాతం పెరగకుండా ఏప్రిల్ నుంచి 6.73 శాతం తగ్గినట్టు తెలిపింది.
- Advertisement -