Saturday, November 16, 2024

ఎస్‌ఐ, ఎఎస్‌ఐ తుది పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఎస్‌ఐ, ఎఎస్‌ఐ పోస్టుల భర్తీకి ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తుది పరీక్ష హాల్‌టికెట్లను పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 6న అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు పూర్తిచేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించే తుది పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్టు ఇటీవల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏదైనా కారణంతో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కాకపోతే support@tslprb.inకు మెయిల్ చేయాలని, లేదంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించాలని నియామక మండలి ఛైర్మన్ ఇదివరకే తెలిపిన సంగతి తెలిసిందే.

హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ4 సైజ్ కాగితంపై ప్రింట్ తీసుకొని, నిర్ణీత ప్రాంతంలో పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అంటించాలని సూచించారు. ఫొటో గుర్తింపులేని వారిని అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషా పరీక్షలను తుది ఎంపికకు పరిగణించకున్నా వీటిలో కనీస మార్కులు సాధించాల్సి ఉంటుందని ఛైర్మన్ వెల్లడించారు. ఈ పరీక్షలను హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లలో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని ఎస్‌సీటీ ఎస్‌ఐ/ఏఎస్‌ఐ పోస్టులకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.

ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సిటి ఎస్‌ఐ/ఎఎస్‌ఐ పోస్టులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి ఎస్‌ఐ (సివిల్) పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సిటి ఎస్‌ఐ (సివిల్) పోస్టులకు తెలుగు/ఉర్దూ పరీక్ష నిర్వహిస్తారు. ఇక చివరగా ఏప్రిల్ 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎస్‌సిటి కానిస్టేబుల్(సివిల్), ఇతర కానిస్టేబుల్ సమాన పోస్టులకు జనరల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అన్ని ఎస్‌సిటి కానిస్టేబుల్ (ఐటి అండ్ సిఒ) పోస్టులకు టెక్నికల్ పరీక్ష్ నిర్వహిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News