Friday, November 22, 2024

ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే లీకేజ్ ఘటన కలకలం రేపిన నేపథ్యంలో మిగతా ఐదు రోజుల పాటు నిర్వహించనున్న పరీక్షలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఛీఫ్ సూపరింటెండెంట్ సహా డిపార్మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు వాడకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ మొదటి పరీక్ష రోజు ఇన్విలేజర్ పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకువెళ్లిన నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలోకి అనుమతి వెళ్లే ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా పరీక్షించాలని పోలీసు అధికారులు, కలెక్టర్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాలలో ఛీఫ్ సూపరింటెండెంట్ ప్రశ్నాపత్రాల సీల్‌ను తెరిచిన తర్వాత కవర్‌లలో డిపార్మెంటల్ అధికారులు ఇన్విజిలేటర్లకు ప్రశ్నాపత్రం అందజేయనున్నారు. ఈ మేరకు అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకోవాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలలో అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి మధ్య సమన్వయ లోపం కారణంగా పేపర్ లీకేజి వంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్షల విధులు నిర్వహించే అందరూ సమన్వయంతో పనిచేసేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News