చెన్నై: ఐపిఎల్ సీజన్16లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. సిఎస్‌కె 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై తొలుత బ్యాటింగ్ చేసి ఎల్‌ఎస్‌కె జట్టు ముందు 218 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఎల్‌ఎస్‌కె 205 పరుగులు మాత్రమే చేసింది. మహేంద్ర సింగ్ ధోని చివరలో చూడముచ్చటైన రెండు సిక్సర్లు బాదాడు. మూడో బంతికి మార్క్ వుడ్ బౌలింగ్ లో రవి బిష్ణోయ్ కి క్యాచ్ ఇచ్చి దోనీ మైదానం వీడాడు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధోని అంటే తడాఖా అని కామెంట్లు వస్తున్నాయి. చివరలో ఆ రెండు సిక్సర్లతో విజయం సాధించినట్టుగా ఉందని కామెంట్లు నెటిజన్లు పెడుతున్నారు.
A treat for the Chennai crowd! 😍@msdhoni is BACK in Chennai & how 💥#TATAIPL | #CSKvLSG
WATCH his incredible two sixes 🔽 pic.twitter.com/YFkOGqsFVT
— IndianPremierLeague (@IPL) April 3, 2023