బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో తాజాగా 100కు పైగా కొత్త కొవిడ్ కేసులు వెలుగుచూశాయని కర్నాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నాటకలో సోమవారం 284 కొత్త కేసులు వెలుగుచూడగా, 132 మందిని డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1410 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్నాటక ప్రతి రోజు సాయంత్రం కొవిడ్ సంబంధిత సంఖ్యలను విడుదల చేస్తోంది. గణాంకాల ప్రకారం పాజిటివ్ రేటు 3.22 శాతంను తాకింది. కాగా వారం పాజిటివిటీ రేటు 2.90 శాతంగా ఉంది.
బెంగళూరు అర్బన్ జిల్లాలో ఒక్క రోజులోనే 170 కొత్త కొవిడ్ కేసులు నమోదు కాగా 50 మందిని డిశ్చార్జ్ చేశారు. నగరంలో 757 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. శివమొగ్గ జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయి. అక్కడ 34 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలావుండగా ప్రభుత్వం కొవిడ్ పరీక్షలను పెంచింది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. గత 24 గంటల్లో 9043 కొవిడ్ పరీక్షలను నిర్వహించారు.
బెంగళూరులో తాజాగా 100కు పైగా కొవిడ్ కేసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -