నేను మీ కోసమే పని చేసే మీ జీవన్ రెడ్డిని
చేపూర్ నాకు సెంటిమెంట్
ఓటేసిన ప్రజలనే కాటేసే పార్టీలవి
జీవన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన చేపూర్ గ్రామస్తులు
ఆర్మూర్: నిరంతరం ప్రజాసేవకే పునరంకితమైన నన్ను మళ్లీ దీవించండి అని పీయూసి చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్ధించారు. నమస్తే నవనాథపురం కార్యక్రమానికి కొనసాగింపుగా వినూత్న రీతిలో చేపట్టిన ’నమస్తే చేపూర్.. మీ కోసం మీ జీవన్ రెడ్డి’ కార్యక్రమం ఆర్మూర్ మండలంలోని చేపూర్లో మంగళవారం కన్నుల పండువగా జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చేపూర్ గ్రామానికి చేరుకున్న జీవన్ రెడ్డికి ఆ గ్రామ ప్రజలంతా మేళతాళాలతో అపూర్వ స్వాగతం పలికారు.
మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మంగళ హారతులు పట్టి జీవన్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆశీస్సులు అందజేశారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఏ సందర్భంగా చేపూర్ గ్రామ ప్రజలంతా ముక్త కంఠంతో జై కెసిఆర్, దేశ్ కీనేత కెసిఆర్, జై జీవనన్న’ అన్న నినాదాలతో మారు మోగించారు కాగా జీవన్ రెడ్డి ప్రజలతో కలిసి గ్రామమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం చేపూర్ గ్రామంలో జరిగిన భారీ సభలో జీవన్ రెడి తనదైన శైలిలో ప్రసంగించి చేపూర్ గ్రామ ప్రజల మనసు దోచుకున్నారు.
నేను మీ కోసమే పని చేసే మీ జీవన్ రెడ్డిని, నేను మీ బిడ్డను నా జీవితం ప్రజా సేవకే అంకితం. ఆర్మూర్ నియోజక వర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లలా పరుగులు పెట్టిస్తున్నా, ప్రగతి పథంలో ఆర్మూర్ పేరును చరిత్రలోనే చెరగని పేజీలా సువర్ణాక్షరాలతో లిఖిస్తా ఆర్మూర్ నియోజక వర్గం గతంలో ఎట్లుంది? ఇప్పుడెట్లుంది? అభివృద్ధి జరగని పల్లె ఉందా? సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉందా? సిఎం కెసిఆర్ ప్రజల పాలిట దేవుడు తెలంగాణ వస్తే ఏమొస్తదని చేపూర్ చేపూర్ చౌరస్తాలో నిలబడి కారు కూతలు కూసిబా సన్నాసులకు చేపూర్ గ్రామంలో జరగిన అభివృద్ధి సంక్షేమమే ధీటైన సమాధానం చేపూర్ గ్రామమంటే నాకు సెంటిమెంట్. ఎనిమిదేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి పనులతో చేపూర్ రూపురేఖలే మారిపోయాయి.