Tuesday, December 24, 2024

IPL 2023: ఢిల్లీతో మ్యాచ్.. బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః ఐపిఎల్ 2023లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ హార్దిక పాండ్యా బౌలింగ్ ఎంచుకుని, ముందుగా ఢిల్లీ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

కాగా, తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించి జోరు మీదున్న గుజరాత్, ఢిల్లీపై కూడా గెలిచి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, లక్నో సూపర్ గేయింట్స్ జట్టు చేతిలో ఓటమి పాలైన ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో గెలుపొంది టోర్నీలో బోణి కొట్టాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News