Saturday, November 23, 2024

ఛత్తీస్‌గఢ్‌లో పేలిన హోం థియేటర్.. నవ వరుడుతో సహా ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్: పెళ్లి బహుమతిగా వచ్చిన హోం థియటేర్ మ్యూజిక్ సిస్టమ్ పేలిపోవడంతో నవ వరుడు అతడి సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లా చమరి గ్రామంలో జరిగిందని పోలీసులు మంగళవారం తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పదార్థాన్ని ఎలక్ట్రానిక్ పరికరంలో అమర్చినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పేలుడు ఘటన సోమవారం ఉదయం రెంగాఖర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చమీర గ్రామంలో జరిగింది. మృతుడు హేమేంద్ర మెరవి (22) గత వారం వివాహం చేసుకున్నాడు. మ్యూజిక్ సిస్టమ్‌ను ఆన్ చేసేందుకు ప్రయత్నించగా పేలిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడని కబీర్‌ధామ్ ఎస్‌పి ఉమెద్ సింగ్ వివరించారు. పేలుడు ధాటికి సిస్టమ్ ఉన్న గోడలు, పైకప్పు పోలీసులు తెలిపారు. హేమేంద్ర మార్చి 30న జల్మలా స్టేషన్ సమీపంలోని అంజన గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం సంప్రదాయం ప్రకారం వధువు తన పుట్టింటికి వెళ్లగా ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. కాగా రెంగాఖర్, జల్మలా స్టేషన్ల ఏరియాల్లో నక్సల్ ప్రభావం ఉంది.

రాజధాని రాయ్‌పూర్‌కు 200కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కాగా సోమవారం మెరవి అతడి కుటుంబ సభ్యులు పెళ్లికి వచ్చిన బహుమతులును విప్పి చూస్తుండగామెరవి ఎలక్ట్రిక్ బోర్డులో మ్యూజిక్ సిస్టమ్ వైరును ఉంచి చేస్తుండగా మెరవి సంఘటన జరిగిన వెంటనే ప్రాణాలు కోల్పోయాడు, అతడి సోదరుడు (30), ఏడాదిన్నర బాలుడితో సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కవర్దాలోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అడిషనల్ ఎస్‌పి మనీషఠాకూర్ తెలిపారు. తీవ్ర గాయాలతో రాజ్‌కుమార్ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఫోరెన్సిక్ టీమ్‌ల ప్రాథమిక దర్యాప్తులో పేలుడు పదార్థాలను మ్యూజిక్ సిస్టమ్‌లో అమర్చినట్లు గుర్తించారని, దర్యాప్తు కొనసాగుతోందని ఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News