Friday, November 15, 2024

వెయిట్ లిఫ్టర్ సంజిత చానుపై నిషేధం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డోప్ టెస్టులో విఫలమైన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ సంజిత చానుపై నాలుగేళ్ల నిషేధం పడింది. సంజితకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. దీంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) చానుపై నాలుగేళ్ల నిషేధం విధించింది. సంజిత చాను భారత ప్రముఖ మహిళా వెయిట్ లిఫ్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. చాను కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు కూడా సాధించింది.

అయితే డోపింగ్ టెస్టుల్లో విఫలం కావడంతో చానుపై నిషేధం విధించక తప్పలేదు. దీంతో చాను 2024 పాల్గొనడం సందేహంగా మారింది. 2017లో కూడా చాను ఓసారి డోప్ టెస్టులో పట్టుపడింది. అప్పట్లో ఆమెపై అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య నిషేధం విధించింది. కానీ ఆ నిషేధాన్ని 2020లో ఎత్తి వేశారు. తాజాగా సంజిత చాను మరోసారి డోప్ టెస్టులో విఫలమైంది. మణిపుర్‌కు చెందిన చాను 201, 2018లలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News