Saturday, December 21, 2024

లీక్ వెనుక దురుద్దేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాల నుండి పదవ తరగతి హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ సిపి సివి రంగనాథ్ మీడియాకు వెల్లడించారు. కమలాపూర్ కేంద్రం నుండి ప్రశ్న పత్రం లీక్ అయిందని తెలిపారు. ప్రశ్న పత్రం కాపీయింగ్ ఘటనలో బాలుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

నిందితుల వద్ద నుండి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మొదట పరీక్ష కేంద్రం నుండి పేపర్‌ను ఫొటో తీసుకున్న బాలుడు ఆ పేపర్‌ను శివ గణేష్‌కు పంపాడు. శివ గణేష్ ఆ పేపర్‌ను ఎస్‌ఎస్సీ గ్రూపుల్లో షేర్ చేశాడు. ఆ గ్రూపుల్లో వచ్చిన పేపర్‌ను ప్రశాంత్ సోషల్ మీడియాలో షేర్ చేసి హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ప్రశాంత్ దురుద్దేశంతోనే ఈ ప్రచారం చేసినట్లు తెలుస్తోందన్నారు. వ్యవస్థ మొత్తాన్ని అప్రతిష్టాపాలు చేయాలనే దురుద్దేశంతోనే ఇలా చేశారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News