Friday, November 1, 2024

సిబిఎస్‌ఇ టెక్ట్‌బుక్స్‌లో ఆర్‌ఎస్‌ఎస్, గాంధీ, గాడ్సే చాప్టర్ల తొలగింపు

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: మహాత్మా గాంధీ హత్య తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)పై అప్పటి ప్రభుత్వం కొద్ది కాలం విధించిన నిషేధానికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచిన 12వ తరగతికి చెందిన పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకాలలోని కొన్ని పారాగ్రాఫ్‌లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్(ఎన్‌సిఇఆర్‌టి) తొలగించింది. దీంతోపాటు..హిందూ, ముస్లిం మధ్య సారస్యాన్ని మహాత్మా గాంధీ కోరుకోవడం హిందూ తీవ్రవాదులను రెచ్చగొట్టిందన్న అంశౠన్ని కూడా పాఠ్యాంశాల నుంచి ఎన్‌సిఇఆర్‌టి తొలగించింది.

గత ఏడాది 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చెందిన పాఠ్యపుస్తకాలలో అనేక మార్పులను ఎన్‌సిఇఆర్‌టి తీసుకురావడం గమనార్హం. రైస్ ఆఫ్ పాపులర్ మూవ్‌మెంట్స్, ఎరా ఆఫ్ ఒన్ పార్టీ డామినెన్స్ శ్రీర్షికతో ఉన్న అధ్యాయాలను కూడా 12వ తరగతికి చెందిన పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ పాఠ్యపుస్తకం నుంచి గత ఏడాది తొలగించారు. అదే విధంగా 10వ తరగతికి చెందిన డెమోక్రటిక్ పాలిటిక్స్- 2 లోని డెమోక్రసీ అండ్ డైవర్సిటీ, పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూవ్‌మెంట్స్, చాలెంజెస్ టు డెమోక్రసి అనే అధ్యాయాలను కూడా ఎన్‌సిఇఆర్‌టి తొలగించింది.

గత 15 ఏళ్లుగా 12వ తరగతికి చెందిన చరిత్ర పుస్తకంలో మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను పుణెకు చెందిన ఒక బ్రాహ్మణుడిగా పేర్కొనగా ఇప్పుడది తొలగించడం విశేషం. గాడ్సే కులాన్ని ప్రస్తావించడంపై తమకు అనేక ఫిర్యాదు వచ్చాయిన ఎన్‌సిఇఆర్‌టి తెలిపింది. కరోనా కాలంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారని, అందువల్ల వారికి పాఠ్యపుస్తకాల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నామని ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ తెలిపారు. ఒక పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఈ మార్పులు చేపట్టారన్న ఆరోపణలను ఎన్‌సిఇఆర్‌టి తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News