Saturday, November 23, 2024

ఐదు రాష్ట్రాల్లో కొత్తగా 10 అణురియాక్టర్లు : కేంద్రం వెల్లడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం లోని ఐదు రాష్ట్రాల్లో కొత్తగా పది అణురియాక్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర అణుఇంధన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం పార్లమెంట్‌కు ఈ విషయాన్ని తెలిపారు. కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లోని అణువిద్యుత్ ప్లాంట్లలో కొత్త అణురియాక్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వరంగ సంస్థ శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. ఈ రియాక్టర్ల కోసం పిఎస్‌యూలను ప్రభుత్వం వినియోగిస్తుంది.

లేదా ప్రత్యేక ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా వీటి ఏర్పాటుకు కసరత్తు జరుపుతుందని లోక్‌సభకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కర్ణాటక లోని కైగా, మధ్యప్రదేశ్ లోని చుట్కా, ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్, అణువిద్యుత్ ప్లాంట్లలో రెండు చొప్పున అణురియాక్టర్లు, రాజస్థాన్ లోని మహి బన్‌స్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో నాలుగు అణురియాక్టర్లు ఏర్పాటు కానున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలతో ఎన్‌పిసిఐఎవ జాయింట్ వెంచర్లు, అణువిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించినట్టు చెప్పారు. రూ. 1,05,000 కోట్ల వ్యయంతో పది అణు రియాక్టర్లను 2031 నాటికి ఫ్లీట్‌మోడ్ విధానంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News