Thursday, November 14, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 373 గ్రాముల అక్రమ బంగారం గుర్తించారు. కస్టమ్స్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం. 6E-1466 విమానంలో హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఓ ప్రయాణికుడు 373 గ్రాముల బంగారాన్ని పేస్ట్ గా తయారుచేసి పాలిథిన్ కవర్ లో ప్యాకింగ్ చేసి దానిని అండర్వేర్ లో దాచుకుని వచ్చాడు.

అయితే అతని కదలికలపై అనుమానం వచ్చినా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని చెకింగ్ చేశారు. దీంతో అతని అండర్వేర్ లో పాలిథిన్ కవర్ లో బంగారం కనిపించింది. దీంతో బంగారాన్ని వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 23 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితున్ని విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News