Monday, December 23, 2024

14రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్/వరంగల్: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి వరంగల్ పోలీసులు బండి సంజయ్‌ని అరెస్ట్ చేసి బుధవారం హైడ్రామా మధ్య హన్మకొండలోని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసు లు, బండి సంజయ్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇ రుపక్షాల వాదనలు విన్న అనంతరం బండి సంజయ్‌కి మేజిస్ట్రేట్ 14 రో జుల రిమాండ్ విధించారు. ఈ నెల 19 వరకు ఆయనకు రిమాండ్ విధి స్తూ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయనతో పాటు మరో ముగ్గురు నిందితులను కరీంనగర్ జైలుకు తరలించారు. మరోవైపు మేజిస్ట్రేట్ నివాసం వద్ద బీఆర్‌ఎస్ , బీజేపీ శ్రేణులు భారీగా మోహరించారు. అటు రిమాండ్‌పై మేజిస్ట్రేట్ ఆదేశాల నేపథ్యంలో బండి సంజయ్ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా టెన్త్ పేపర్ లీక్ కేసులో సంజయ్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ బిజెపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర పెద్దలు పరిస్ధితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రివిలైజ్ నోటీసు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ పై దాఖలైన పిటిషన్‌ను గురువారం ఉదయం విచారించనున్నట్టుగా తెలంగాణ హైకోర్టు తెలిపింది. బీజేపీ నేత సురేందర్ రెడ్డి ఈ పిటిషన్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో బండి సంజయ్‌ని ఏ1 నిందితుడిగా పోలీసులు చేర్చారు. మిగతా నిందితులలో ఎ2 బూర ప్రశాంత్, ఎ3 మహేష్, ఎ4 మైనర్‌బాలుడు, ఎ5 మోతం శివగణేష్, ఎ6 పోగు సుభాష్, ఎ7 పోగు శశాంక్, ఎ8 దూలం శ్రీకాంత్, ఎ9 పెరుమాండ్ల శార్మిక్, ఎ10 పాతబోయిన వసంత్‌లు ఉన్నారు. ఇదిలా ఉండగా బండి సంజయ్ కస్టడీ కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు పర్చనున్నట్లు వరంగల్ సిపి రంగనాథ్ తెలిపారు.

బండి సంజయ్‌ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు

కాగా, బండి సంజయ్‌ను పోలీసులు హనుమకొండ కోర్టులో హాజరుపర్చే సమయంలో కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బిజెపి శ్రేణులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో బండి సంజయ్‌ను పోలీసులు హనుమకొండ కోర్టు వెనుక ద్వారం నుంచి తీసుకెళ్లారు. అంతకుముందు బండి సంజయ్‌కు పాలకుర్తి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

పోలీసు వాహనంపై చెప్పులు విసిరిన గుర్తు తెలియని వ్యక్తులు

తమను కోర్టులోకి వెళ్లనివ్వాలంటూ సంజయ్ తరఫు లాయర్లు హనుమకొండ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు కోర్టు ప్రాంగణం గేటుకు తాళాలు వేశారు. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణం వద్ద లాయర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో బండి సంజయ్ తరఫు న్యాయవాదులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పాలకుర్తి నుంచి బండి సంజయ్‌ను కోర్టుకు తరలిస్తున్న పోలీసు వాహనంపై హనుమకొండ కోర్టు చౌరస్తా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News