ఒకపక్క కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండగా, మరో వంక మరికొన్ని ప్రాణాంతక వ్యాధులు ప్రజలను పీడిస్తున్నాయి. గత ఏడాది జులై ప్రాంతంలో పశ్చిమబెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్‌ఫీవర్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. బ్లాక్‌ఫీవర్ (నల్లజ్వరం) లేదా కాల్‌అజర్ అని పిలుస్తుంటారు. సాండ్ ఫ్లై అనే ఈగల వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
బ్లాక్‌ఫీవర్ ఎక్కువగ చిన్నారుల్లో ఇది వ్యాపిస్తుంది. ఇది సోకితే అకస్మాత్తుగా బరువు తగ్గిపోతారు. దీనికి సరైన చికిత్సలేదు. వ్యాక్సిన్ లేదు. లక్షణాల బట్టి వైద్యచేయడమే ప్రత్యామ్నాయం. బ్లాక్‌ఫీవర్ మెలమెల్లగా వ్యాపించే దీర్ఘకాలిక వ్యాధి. జ్వరం, బరువుతగ్గడం, కాలేయం మరియు ప్లీహం వాపు, రక్తహీనత, ఆకలి తగ్గిపోవడం, చర్మం పొడిబారి పొలుసులుగా మారడం, కాలేయం పెరగడం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి.
బ్లాక్‌ఫీవర్ నిర్ధారణకు రెండు విధానాలున్నాయి. రోగ లక్షణాల ఆధారంగా జరిగే చికిత్స ఒకటి కాగా, ప్రయోగశాల ఆధారంగా పరిశీలించేది మరొకటి. బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీలను తనిఖీ చేస్తారు. దీన్ని సెరొలాజికల్ పరీక్షలంటారు. ఎముక మజ్జ, ప్లీహం, లైంఫ్, నోటి నుంచి కణసమూహాన్ని బయోప్సీ ద్వారా సేకరించి పరీక్షిస్తారు. బ్లాక్‌ఫీవర్ నివారణకు తగిన మందులు లేనందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వృద్ధులు పొడవు చేతులున్న షర్టులు, ఫ్యాంట్లు తొడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రసాయన స్ప్రేలు జల్లి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం, రాత్రుళ్లు ఈ కీటకాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి కాబట్టి ఆ సమయాల్లో ఎంతోపని ఉంటే తప్ప బయటకు వెళ్లరాదు. రోగకారక క్రిములను చంపే యాంటీ పారసైట్ మందులు వాడాలి. నోటిద్వారా తీసుకునే మిల్లెఫోసైన్ ( millefosine ) మందు రోగుల్లో 95 శాతం ప్రభావం చూపిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.