Monday, December 23, 2024

1.30 లక్షల సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సిఆర్‌పిఎఫ్)లో 1.30లక్షల కానిస్టేబుల్ పోస్టుల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర హోం వ్యవహారాల శాఖ గురువారం విడుదల చేసింది. ఈ నియామకాలలో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. మొత్తం 1,29,920 గ్రూప్ సి కేటగిరికి చెందిన కానిస్టేబుల్ పోస్టులలో(జనరల్ డ్యూటీ) 4,667 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు.

మాజీ అగ్నివీరులకు చెందిన మొదటి బ్యాచ్ అభ్యర్థులకు గరిష్ఠ వయో పరిమితి ఐదేళ్ల వరకు సడలించారు. మాజీ అగ్నివీరులకు శరీర దారుఢ్య పరీక్ష(పిఇటి)లో మినహాయింపు ఉంటుంది. ఈ పోస్టులకు కనీస విద్యార్హత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి బెట్రిక్ లేదా ఎస్‌ఎస్‌సి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News