Friday, December 20, 2024

సెక్స్ ‘ఓ అందమైన విషయం’: పోప్ ఫ్రాన్సిస్

- Advertisement -
- Advertisement -
‘పోప్ ఆన్సర్స్’ అనే డిస్నీ ప్రొడక్షన్ డాక్యుమెంటరీలో పోప్ ఈ విషయం గత సంవత్సరం 20 ఏళ్లున్న పదిమందితో సమావేశమైనప్పుడు తెలిపారు.

ఫ్లోరిడా:  పోప్ ఫ్రాన్సిస్ బుధవారం విడుదల చేసిన డాక్యుమెంటరీలో సెక్స్ సద్గుణాలను ప్రశంసించారు. ‘దేవుడు మానవులకు ఇచ్చిన అందమైన విషయాల్లో సెక్స్ ఒకటి’ అని అభివర్ణించారు. గత సంవత్సరం 20 ఏళ్లలో ఉన్న పది మంది వ్యక్తులతో 86 ఏళ్ల ఆయన సమావేశమైనప్పుడు తీసిన డిస్నీ ప్రొడక్షన్ ‘ది పోప్ ఆన్సర్స్’ అనే డాక్యుమెంటరీలో ఆయన ఈ విషయం చెప్పారు.

కేథలిక్ చర్చి పరిధిలో ఎల్‌జిబిటి హక్కులు, అబార్షన్లు, అశ్లీల పరిశ్రమ, సెక్స్, దైవ విశ్వాసం- సెక్స్ వంటి అనేక విషయాలపై ఆయన తన అభిప్రాయాలు తెలిపారు. ‘మనిషికి దేవుడు ఇచ్చిన అందమైన వస్తువు సెక్స్’ అని ఆయన ఆ డాక్యుమెంటరీలో తెలిపారు. ఎల్‌జిబిటి గురించి ఆయన మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే. దేవుడు ఎవరీనీ తృణీకరించలేదు. దేవుడు మన తండ్రి. చర్చి నుంచి ఎవరినీ బహిష్కరించే హక్కు నాకు లేదు’ అన్నారు. ఇక అబార్షన్లపై ఆయన ‘గర్భస్రావం చేయించుకున్న మహిళలపై ప్రీస్ట్‌లు కనికరం కలిగి ఉండాలి. కానీ ఈ ఆచరణ ఆమోదయోగ్యం కాదు’ అన్నారు. పోప్ వ్యాఖ్యలు వ్యాటికన్ వార్తా పత్రిక ‘ల ఆసరవాటోర్ రోమానో’లో ప్రచురితమయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News