Monday, December 23, 2024

పీసీసీ ఇవ్వనప్పుడే పార్టీ మారేవాడిని: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఖండించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలతో తాను ఇటీవల జరిపిన సమావేశాలు కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినవేనని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారేవాడినే అయితే.. పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వనప్పుడే పార్టీ మారేవాడినని, కాంగ్రెస్‌ని వీడే ప్రసక్తే లేదన్నారు. పార్టీ ఆదేశిస్తే మళ్లీ ఎమ్మెల్యేగా, ఎంపిగా పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో పదవి వస్తుందని ఆశిస్తున్నానని ఆయన వివరించారు. తాను కాంగ్రెస్‌కు కట్టుబడి ఉన్నానని, తనకు వేరే మార్గం లేదని కోమటిరెడ్డి ఉద్ఘాటించారు. పుకార్ల వెనుక ఉన్న దురుద్దేశాన్ని ఆయన ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఏకైక లక్ష్యంతో ఇలాంటి వార్తలను వ్యాప్తి చేస్తున్నారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News