Saturday, November 23, 2024

9,231 గురుకులాల్లో భారీగా ఉద్యోగాల భర్తీ

- Advertisement -
- Advertisement -

మన నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని గురుకులాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,231 పోస్టులకు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడి గా విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో 868 అధ్యాపక, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే, జూనియర్ కళాశాలల్లో 2,008 లెక్చర ర్లు, పాఠశాలల్లో 1,276 పిజిటి, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4020 టిజిటి పోస్టులను భర్తీ చేయనున్నట్లు షార్ట్ నోటిఫికేషన్లలో పేర్కొంది. ఈ నెల 12 నుంచి పన్ టైం రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల సంక్షేమ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలకు వేర్వేరుగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పయో పరిమితి, వి ద్యార్హత., ఇతర వివరాలతో పూర్తి నోటిఫికేషన్లు దరఖాస్తుల ప్రారంభమైన రోజు నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్ పేర్కొన్నారు.
పోస్టుల వారీగా ఖాళీలు, తేదీలు
ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్(టిజిటి) పోస్టులు 4,020 ఉండ గా, ఈ నెల 28 నుంచి మే 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు లు స్వీకరించనున్నారు. వేతన స్కేలు రూ. 42,300 నుంచి రూ.1,15,270 వరకు ఉండనుంది. డిగ్రీ కళాశాలల్లో మొ త్తం 868 పోస్టులకు గాను వేతనం రూ. 54,220 నుంచి రూ. 1,33,630లుగా ఉంటుందని గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు పేర్కొంది. వయో పరిమితి, పోస్టుల వారీగా వేతనం, కమ్యూనిటీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో ఈ నెల 17న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వెబ్‌నోట్‌లో తెలిపింది. ఈ నెల 17 నుంచి మే 17 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అలాగే జూనియర్ కళాలల్లో 2008 పోస్టులకు (జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్) వేతనం రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుందని తెలిపింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ ఉద్యోగాల్లో మొత్తం 1,276 పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందులో పోస్టులకు వేతనం రూ.45,960 నుంచి రూ.1,24,150గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మూడు గురుకుల సొసైటీల్లోని పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వేతనం రూ.38.890 నుంచి 1,12,510గా ఉండనుంది. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 275 ఉండగా.. ఈ పోస్టులకు వేతనం రూ.42,300 నుంచి రూ.1,15,270 మధ్య ఉండనుంది. ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ (134) పోస్టులు ఉండగా.. క్రాఫ్ట్ టీచర్, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు 92 ఉన్నాయి. అలాగే, మ్యూజిక్ టీచర్ పోస్టులు 124 ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News