- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కొలేక.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఆరోపించారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీపై రాష్ట్ర మంత్రులు ఏ రోజు మాట్లాడలేదని, పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సప్‌లో బండి సంజయ్‌కి చేరడం నేరమా? ఆమె ప్రశ్నించారు.
ప్రజల దృష్టిని మళ్లించేందుకు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ప్రజల్లో ఐఎఎస్, ఐపిఎస్‌లపై విశ్వాసం ఉందని, ఆ హోదా, గౌరవాన్ని వారు పోగొట్టుకోవద్దని కోరారు. నియంత పోకడలను సమర్థించే అధికారులను చరిత్ర క్షమించదన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం అంటూ దొంగ కేసులు పెట్టారు. మోగడిని గొట్టి మొగసాలకు ఎక్కినట్లు వ్యవహరిస్తున్నారు.
- Advertisement -