Friday, November 22, 2024

ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు!

- Advertisement -
- Advertisement -
ప్రధాని సామాజిక న్యాయంను తూర్పారబట్టిన కపిల్ సిబల్

న్యూఢిల్లీ: సామాజిక న్యాయంకై బిజెపి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్న దానిపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ శుక్రవారం ధ్వజమెత్తారు. నేటి ప్రభుత్వ హయాంలో ‘ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, పేదలు మరింత పేదలవుతున్నారు’ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం బిజెపి 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బిజెపి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంగా ఆయన ఉచిత రేషన్ పథకం, ఆరోగ్య భీమా, ఇతర సంక్షేమ చర్యల గురించి ఎలుగెత్తారు. సామాజిక న్యాయంకు బిజెపికి కట్టుబడి ఉందన్నారు. ఇతర పార్టీలను ఆయన విమర్శిస్తూ కొన్ని కుటుంబాలకే అవి ప్రయోజనాలు కలిగిస్తున్నాయని, అందరికీ సామాజిక న్యాయం కల్పించడంలేదని అన్నారు.

సిబల్ తన ట్వీట్‌లో  ‘ప్రధాని: బిజెపి సామాజిక న్యాయం కోసమే జీవిస్తోంది, మనసావాచా అదే స్ఫూర్తిని అనుసరిస్తోంది.’
వాస్తవాలు ఏమిటంటే: 1) 2020-2021 నుంచి సృష్టించిన సంపదలో 40 శాతం జనభాలోని 1 శాతం మందికే అందుతోంది. 2) 2022లో అదానీ సంపద 46 శాతం పెరిగింది. 3) జిఎస్‌టిలో 64 శాతం అట్టడుగున ఉన్న 50 శాతం జనం నుంచే వచ్చింది. కాగా 4 శాతం మాత్రం టాప్ 10 శాతం జనం నుంచి వచ్చింది. ధనవంతులు మరింత ధనవంతులవుతుంటే, పేదలు మరింత పేదలవుతున్నారు’ అని పేర్కొన్నారు.

కపిల్ సిబల్ యుపిఎ 1, యుపిఎ 2 ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా ఉండేవారు. తర్వాత గత ఏడాది మేలో ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన నాన్‌ఎలెక్టోరల్ ప్లాట్‌ఫామ్ ‘ఇన్‌సాఫ్’ను ఏర్పాటు చేసి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News