Saturday, November 23, 2024

బిజెపిలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉమ్మడి ఎపి మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో తన అనుచరులతో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కాషాయ దళంలో చేరారు. రణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరడంతో ఎపిలో తమ పార్టీ బలోపేతం అవుతుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఎంఎల్‌ఎగా, స్పీకర్‌గా, సిఎంగా కిరణ్ సేవలందించారని ప్రశంసించారు. కిరణ్ బిజెపిలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజన చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. తరువాత పరిణామ క్రమంలో సమైక్యాంధ్ర పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఉమ్మడి ఎపికి చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పని చేశారు. గతంలో ఎపి శాసన సభ స్పీకర్‌గా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News