బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఈ వారం కరీంనగర్‌లో అరెస్టు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్‌ను అరెస్టు చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌ను బిజెపి న్యాయ విభాగం సభ్యుడు నీలం భార్గవ రామ్ బెదిరించినట్లు తెలిసింది. కోర్టు గురువారం బండి సంజయ్‌కు బెయిల్ ఇచ్చాక ఈ బెదిరింపు చేసినట్లు తెలిసింది. పదవ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ కేసులో బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాతా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
సెంట్రల్ హైదరాబాద్‌లోని బిజెపి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ అయిన రామ్ ట్విట్టర్‌లో ‘కమీషనర్@cpwrl, మీ ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి ఉత్తమంగా ప్రయత్నించండి, మీ కాల్ లాగ్‌లతో సహా ప్రతిదీ విచారించబడుతుంది. బండి సంజయ్‌ను తప్పుడు కేసులో ఇరికించాలని మిమ్మల్ని ఎవరు ఆదేశించారో అన్న దానిపై దర్యాప్తు జరుగుతుంది. ఢిల్లీలో ఉన్న బిసి కమిషన్ ఈ కేసును పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకు రాగలదు’ అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ బిజెపి సభ్యుడి ప్రకటనను ప్రశ్నించారు. దిలీప్ ట్వీట్ చేస్తూ ‘నిజాయితీ, నిబద్ధత కలిగిన పోలీసు అధికారులను బహిరంగంగా బెదిరించడం, దుర్భాషలాడడం బిజెపి కొత్త ఆచారమా? మొన్న బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు దుర్భాషలాడారు, ఇప్పుడు మరో బిజెపి కార్యకర్త బెదిరిస్తున్నారు. అంతా గమనిస్తున్నాం’ అన్నారు.
Openly threatening and abusing sincere and committed police officers is the new norm for BJP?
The other day BJP MLA @RaghunandanraoM abused @TelanganaDGP now another BJP functionary is threatening @cpwrl
Hope @IPS_Association is taking note! https://t.co/E5fXElpyE2
— Konatham Dileep (@KonathamDileep) April 7, 2023