Monday, December 23, 2024

పిఎం కిసాన్ డబ్బులు పొందే రైతులకు హెచ్చరిక..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పిఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 6000 లను విడతల వారిగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులు పొందే రైతులు ఖచ్చితంగా ఒక విషయం తెలసుకొవాలి. పిఎం కిసాన్ స్కీమ్ కింద అర్హతలు లేకపోయిన డబ్బులు పొందే వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఎవరైతే ఈ స్కీమ్ కింద అర్హత లేకపోయిన డబ్బులు పొందుతున్నారో వాళ్ల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులను వెనక్కి తీసుకొనుంది.

ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రూ.2000 పొందే అవకాశం ఉంది. ఒక్కరికి కంటే ఎక్కువ మంది డబ్బులు పొందుతూ ఉంటే వారు ఆ డబ్బులను వెనక్కి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ డబ్బులను వెనక్కి ఇవ్వకపోతే జైలు కు వెళ్లాల్సి రావొచ్చు. ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇలా కొంత మంది అర్హత లేకుండా పిఎం కిసాన్ ప్రయోజనాలు పొందుతున్నారనే విషయాన్ని ఆయా ప్రభుత్వాలు గుర్తించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News