Saturday, November 23, 2024

చంద్రుడి పైకి వెళ్లనున్న తొలి మహిళ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:1969లో అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలిసారి చంద్రుడి మీద అడుగు పెట్టాడు. అపోలో మిషన్‌లు ముగిసిన 50 ఏళ్ల తర్వాత చంద్రుడి పైకి నలుగురు వ్యోమగాములను నాసా పంపనుంది. చంద్రుణ్ణి అందుకోవడానికి అమెరికా నాసా ద్వారా 1968 నుంచి 72 మధ్య ‘అపోలో’ ద్వారా 24 మంది వ్యోమగాములను పంపితే 12 మంది చంద్రుడిపై దిగ గలిగారు. అయితే వారంతా పురుషులు.ఇప్పటి వరకూ ఒక్కమహిళ కూడా చంద్రుడి పైకి వెళ్ల లేదు. కానీ ఓ మహిళ త్వరలో చంద్రుడి పైకి వెళ్లనుంది.

‘అర్టిమిస్-2’ పేరుతో నాసా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న చంద్రుని ప్రదక్షిణకు నలుగురు వ్యోమగాములని ఎంపిక చేసింది. ఈ ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో క్రిస్టినా కోచ్ అనే మహిళ ఉంది. ఆ విధంగా చంద్రుడి వరకూ వెళ్లగలిగిన తొలి మహిళగా ఈమె చరిత్ర సృష్టించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News