Thursday, December 19, 2024

జార్ఖండ్‌లో అదానీ విద్యుత్ కేంద్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ముంబై : విమర్శల షాక్‌ల నడుమనే అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ పవర్ లిమిటెడ్ జార్ఖండ్‌లో సరికొత్తగా ఓ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా చేస్తారు. జార్ఖండ్‌లో తాము 800 మైక్రోవాట్స్ ఉత్పదక సామర్థపు కొత్త విద్యుత్ కేంద్రం మొదటి యూనిట్‌ను ప్రారంభించినట్లు సంస్థ శుక్రవారం తమ అధికారిక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2x 800 అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టు పేరిట అదానీ పవర్ (జార్ఖండ్) లిమిటెడ్ (ఎపిజెఎల్)కు అనుసంధానంగా ఈ విద్యుత్ కేంద్రాన్ని ఆరంభించారు.

అదానీ పవర్ నుంచి బంగ్లాదేశ్ విద్యుచ్ఛక్తి బోర్డుకు పాతిక ఏళ్ల పాటు అమలులో ఉండే విద్యుత్ విక్రయ ఒప్పందం అమలులో ఉంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్‌కు 748 ఎండబ్లుల విద్యుత్ సరఫరా అవుతుంది. ఇప్పుడు జార్ఖండ్‌లో ఆరంభం అయింది కేవలం యూనిట్ 1. తరువాతి క్రమంలో రెండో యూనిట్ త్వరలోనే 800 ఎండబ్లుల సామర్థంతో సిద్ధం కావడానికి తుది సన్నాహాలలో ఉంది. ఇక్కడి నుంచి త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి ఆరంభం అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News