Saturday, November 23, 2024

సింగరేణిపై చర్చకు సిద్ధం : ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సింగరేణి గనులపై ఏ వేదిక మీద అయిన చర్చకు తాము సిద్దమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా బిఆర్‌ఎస్ నిరసనలకు పిలుపు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సింగరేణిపై చర్చకు సిద్దం. నిజాయితీ ఉంటే రావాలని సవాలు విసిరారు. అబద్ధపు ప్రచారంతో సామాన్య ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించవచ్చు కానీ సింగరేణివాసులకు నిజాలు తెలుసు అని వెల్లడించారు. రూ.6300 కోట్లతో రామగుండం ఎరువుల కంపెనీ తిరిగి ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. 51 శాతం రాష్ట్రం వాటా ఉన్న తరువాత కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అని ప్రధాని మాట్లాడారు. దానికి సమాధానం లేదు.

కానీ ఇప్పుడు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం 216 మైన్స్ కేటాయించడంతో లక్ష 86 వేల కోట్ల నష్టం జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. వాటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు.దీని ఆధారంగా మోదీ సర్కార్ 2015లో ఎంఎంఆర్‌డి యాక్ట్‌ని సవరణ చేసిందని, దీనికి బిఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. కొత్త చట్టం ప్రకారం మూడు పద్దతుల్లో బొగ్గు గనుల కేటాయింపు చేస్తున్నారు. అందులో సిమెంట్, ఐరన్, కొల్ ఆధారిత పరిశ్రమలకోసం క్యాపిటివ్ మైన్స్‌కి అవకాశం, ఆదాయంలో 14 శాతం రాయల్టీ కడితే టెండర్ లేకుండా డైరెక్ట్ గా మైన్స్ కేటాయింపు, వేలం పాట (ఆదాయంలో 4 శాతం రాయల్టీ కట్టాలి)తో అప్పగిస్తున్నారని వెల్లడించారు.ఈ పద్దతిలో కోల్ ఇండియా దేశవ్యాప్తంగా 116 గనులు తీసుకోగా..

తెలంగాణకు నయిని, న్యూ పాత్రపద, పెనగడప మైన్స్ సింగరేణికి కేంద్రం అలాట్ చేసిందన్నారు. తెలంగాణలో ఉన్న నాలుగు గనుల కోసం ఇక్కడి ప్రభుత్వం ఒక్క మాట కూడా అడగలేదన్నారు. తెలంగాణలోని కేకే 6 15.84 ఎంటి, శ్రావణపల్లి 160 మిలియన్ టన్నులు, కోయగూడెం 119 ఎంటి, సత్తుపల్లి 69.53 ఎంటికి దరఖాస్తు చేసుకోలేదన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు 3500 కోట్ల బ్యాంక్ నిల్వలతో ఉన్న సింగరేణి ఇప్పుడు 10 వేల కోట్ల అప్పులో కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 20 వేలకోట్ల అప్పు ఉంది. సింగరేణినీ ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. కోల్ మైన్స్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో రోజుకు రూ. 930 ఇస్తే,

సింగరేణిలో రూ. 430- మాత్రమే ఇస్తు శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ గౌరవ అధ్యక్షులు అశ్వద్ధామ రెడ్డి, అధికార ప్రతినిధి సుభాష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News