Friday, December 20, 2024

మన పల్లెకు పట్టం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కీర్తి కిరీటంలో మరికొన్ని అవార్డులు వచ్చి చేరాయి. జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో తెలంగాణ పలు పురస్కారాలు దక్కించుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం తొమ్మిది విభాగాల్లో కలిపి 27 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో తెలంగాణ రాష్ట్రంలోని పలు పంచాయతీలు 8 అవార్డులను దక్కించుకున్నాయి. 4 కేటగిరీల్లో రాష్ట్ర పంచాయతీలు మొదటి, రెండో స్థానంలో నిలిచాయి. ఇప్పటికే అనే క అవార్డులు, రివార్డులు, రికార్డులతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు మరోసారి కేంద్ర అవార్డుల పంట పండింది.

పురస్కారాలకు ఆన్‌లైన్‌లో నామినేషన్లు

ప్రతి ఏటా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచి న గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అవార్డుల అందజేస్తోం ది. జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా ఆన్‌లైన్‌లో పంచాయతీల ద్వారా నామినేషన్‌లను స్వీకరించి.. తొమ్మిది అంశాలలో(థీమ్‌లలో) ఉత్తమ గ్రా మ పంచాయతీలకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి లో, జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డులను ప్రకటించారు. అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గ్రామ పంచాయతీలలో పోటీతత్వం పెరిగి మరింత అభివృద్ధికి కృషి చేస్తాయి. ఈ సంవత్సరం నుంచి అ వార్డులను తొమ్మిది అంశాలలో ఏ పంచాయతీలు ప్రగతిని సాధించాయో వాటికి మొదటి, రెండవ, మూడో బహుమతులుగా అవార్డులిచ్చింది. ఇందు లో ప్రతి అంశానికి వంద మార్కులతో సూచికలను ప్రకటించింది. ఈ తొమ్మిది అంశాలలో ప్రతి పంచాయతీ సాధించిన మార్కుల ఆధారంగా దేశంలో అత్యుత్తమ పంచాయతీలుగా ప్రకటించారు.

5 నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు

తెలంగాణకు మరో ఐదు అవార్డులు వచ్చాయి. ఎనిమిది దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలకు తోడుగా, తాజాగా మరో 5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు లభించాయి. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్, శాఖ ఆర్థిక సలహాదారు బిజయకుమార్ బెహ్రా ప్రకటించారు. దీంతో కేంద్రం ప్రకటించిన పుసర్కారాలలో మొత్తం 13 పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఏప్రిల్ 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల అందజేస్తామని, సంబంధిత ప్రతినిధులను ఒక రోజు ముందుగా పంపించాలని ఆ లేఖలో కోరారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక పల్లె, పట్టణ ప్రగతితోనే అవార్డులు వచ్చాయని మంత్రి ఎర్రబెల్లిని, ఆయన బృందాన్ని మంత్రులు కె.తారకరామారావు, హరీశ్ రావులు ట్విట్టర్ వేదికగా అభినందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతోనే అవార్డులు దక్కాయని రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. కెసిఆర్‌కు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డుల రావడానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలను మంత్రులు తెలిపారు.

నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2023..

1. ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీల అవార్డు విభాగంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి.

2. ఉత్తమ జిల్లా పరిషత్ విభాగంలో ములుగు జిల్లా

3. స్పెషల్ కేటగిరీ అవార్డుల్లో… గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామం

4. కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్ విభాగంలో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం

5. నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ – సర్టిఫికేట్ల విభాగం – గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ కు సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి ఎంపికైంది.

ముఖ్యమంత్రి మార్గ నిర్దేశనంతోనే..  ఎర్రబెల్లి దయాకర్‌రావు

ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశనం.. పల్లె ప్రగతి, మంత్రి కెటిఆర్ సహకారంతోనే ఈ అవార్డులు దక్కాయి. వారికి నా కృతజ్ఞతలు,ధన్యవాదాలు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. ప్రశంసలు, అవార్డులు ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి, దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఈ అవార్డుల రావడానికి కృషి చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి, శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు, డిఆర్డీవోలు, డిపిఓలు, ఎంపిడిఓలు, గ్రామ కార్యదర్శులు, పంచాయతీరాజ్ సిబ్బంది, సర్పంచ్‌లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, సహకరించిన ప్రజలకు పేరుపేరునా మంత్రి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు వచ్చిన గ్రామాలు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, రాని గ్రామాలు అవార్డులు తెచ్చుకోవడానికి పట్టుదలతో పని చేయాలని సూచించారు.

సిఎం కెసిఆర్ నాయకత్వంతోనే సాధ్యమైంది : హరీశ్ రావు

జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం సిఎం కెసిఆర్ దార్శనికతకు నిదర్శనమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. 27వ జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణకు ఎనిమిది అవార్డులు వచ్చాయని, నాలుగు కేటగిరీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వం, గ్రామీణాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత వల్లే ఇది సాధ్యమైందని హరీశ్ రావు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బృందానికి ఆయన అభినందనలు తెలిపారు.

పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి: కెటిఆర్

జాతీయ స్థాయిలో తెలంగాణ మరోసారి మెరిసింది. జాతీయ పంచాయతీ రాజ్ అవార్డుల్లో మరోసారి సత్తాచాటింది. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలో నమోదైంది. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీలు తెలంగాణలోనే ఉన్నాయి. దార్శనికుడైన సిఎం కెసిఆర్ అద్భుత పనితీరు సాధ్యం అయింది. కెసిఆర్ మానసపుత్రిక పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, బృందానికి నా అభినందనలు‘ అని కెటిఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. వంద శాతం ఓడీఎప్ ప్లస్‌లోనూ తెలంగాణ పల్లెలు నంబర్ వన్‌గా నిలిచాయని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News