Saturday, October 26, 2024

తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదు: మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిబిఐ, ఈడి వంటి సంస్థలను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విమర్శించారు. అవినీతి, వంశ రాజకీయాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయని ఆరోపించారు. తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనచేశాక ఆయన ‘కొన్ని అవినీతి పార్టీలు కోర్టుకు వెళ్లాయి, తమ అవినీతి చిట్టా తెరువబడకుండా ఉండేందుకు అవి అలా చేశాయి. కానీ అక్కడ వారు ఖంగు తిన్నారు’ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రభుత్వంపై కూడా ధ్వజమెత్తారు. అనేక ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి రాష్ట్రం నుంచి సహకారం ఉండకపోవడమే కారణమన్నారు. ‘తెలంగాణలో అనేక కేంద్ర ప్రాజెక్టులు ఆలస్యం కావడంపై నేను కలత చెందుతున్నాను. అవి ఆలస్యం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడమే కారణం. అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టించొద్దని నేను కోరుతున్నాను’ అన్నారు. ప్రధాని తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో రెండు రోజులు పర్యటించనున్నారు. ఆయన దక్షిణాది రాష్ట్రాలలో అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News