Thursday, January 23, 2025

ఢిల్లీపై రాజస్థాన్ ఘన విజయం….

- Advertisement -
- Advertisement -

గౌహతి: ఐపిఎల్‌లో భాగంగా బర్సాపారా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్ ఘన విజయం సాధించింది. ఆర్‌ఆర్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. డిసి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ ఉంచింది. డిసి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 65 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. డిసి బాట్స్‌మెన్లు డేవిడ్ వార్నర్(65), లలిత్ యాదవ్ (38), రిలీ రుస్సో(14), అక్షర పటేల్ (02), రోవ్‌మాన్ పావెల్ (02), అభిషేక్ పోరెల్ (03) పరుగులు చేశారు. పృథ్వీ షా, మనీష్ పాండే జీరో పరుగులు చేసి డకౌట్ రూపంలో వెనుదిరిగారు. బౌల్ట్ మూడు వికెట్లు తీసి డిసి వెన్నువిరిచాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు, యుజేంద్ర చాహల్ మూడు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News