హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి రాలేదని, విషం చిమ్మడానికే వచ్చారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్ర ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రం సహకరించడంలేదని ఆయన ప్రకటించారని అన్నారు. ‘ఆయన చెప్పే ప్రతి మాట సత్య దూరమైనది. అబద్ధాలాడడం ఆయన స్థాయికి వొప్పవు’ అని హరీశ్ రావు అన్నారు.
‘తెలంగాణ రాష్ట్రానికి గిరిజన యూనివర్శిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ పరిశ్రమ, మెడికల్ కాలేజ్‌లు, నర్సింగ్ కాలేజ్‌లు కేంద్రం కేటాయించడంలేదు’ అని ఆయన విమర్శించారు. ‘అదానీ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రధాని ‘పరివార్‌వాద్’ (కుటుంబ పాలన) అంశాన్ని లేవనెత్తారు’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛను, రైతు బంధు డబ్బు లబ్ధిదారు ఖాతాల్లోనే జమాచేస్తోందన్నారు. ‘డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్’(డిబిటి) తన వల్లే మొదలయిందని ఆయన అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు వివరించారు.
ప్రధాని మోడీ గారు, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి వచ్చినట్లు లేదు. తెలంగాణ పై తన కడుపులోని విషాన్ని కక్కడానికి వచ్చినట్లు ఉంది.
ప్రతీ మాట సత్య దూరం. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లింది.
తెలంగాణ ఏర్పడినప్పటి నుండీ ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి…
— Harish Rao Thanneeru (@BRSHarish) April 8, 2023