Monday, December 23, 2024

‘మిసెస్ ఇండియా గ్లోబల్’ ఫైనల్స్‌కు అంకిత ఠాకూర్

- Advertisement -
- Advertisement -

పెగాసిస్ వారు నిర్వహిస్తోన్న ‘మిసెస్ ఇండియా గ్లోబల్’ ఫైనల్స్‌కు ఎంపికయ్యారు సినీ నటి అంకిత ఠాకూర్. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ‘మిసెస్ ఇండియా గ్లోబల్’ ఫైనల్స్‌కు ఎంపికైన అంకిత ఠాకూర్ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసి మాట్లాడుతూ “తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ ‘మిసెస్ ఇండియా గ్లోబల్’ ఫైనల్స్ కు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓటింగ్ ద్వారా అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. కొచ్చీలో ఈ నెల 11న ‘మిసెస్ ఇండియా గ్లోబల్’ ఫైనల్స్ జరుగుతాయి”అని అన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ “ఖచ్చితంగా అంకిత ఠాకూర్ ‘మిసెస్ ఇండియా గ్లోబల్’ విజేతగా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు వారందరూ కూడా ఆమెకు ఓట్లు వేసి మద్దతు తెలపాలని కోరుకుంటున్నా”అని చెప్పారు. ఈ సమావేశంలో ‘మిస్ ఏషియా’ రష్మి ఠాకూర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News